Telangana: కోవిడ్ కోరల్లో చిక్కుకున్న తెలంగాణ..
గత వారం రోజులుగా కరోనా కరాళ నృత్యమాడుతోంది. కేసుల తీవ్రత అధికమవుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. కాగా ఆదివారం నాడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
హైదరాబాద్: గత వారం రోజులుగా కరోనా కరాళ నృత్యమాడుతోంది. కేసుల తీవ్రత అధికమవుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. కాగా ఆదివారం నాడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 199 కేసులతో చాలా రోజుల తరవాత పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ఇందులో తెలంగాణకు చెందినవి 196 కాగా వలస వచ్చిన ముగ్గురికి కోవిడ్-19 నిర్ధారణ అయ్యింది.
Also Read: Telangana: ట్రాలీని ఢీకొట్టిన లారీ...
మరోవైపు హైదరాబాద్ నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఆదివారం ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్ తేలిందని, రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా వరంగల్ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ బులెటిన్ లో విడుదల చేసింది.కాగా ఆదివారం నాడు మరో ఐదుగురు ఈ కరోనా మహమ్మారి బారిన పడి మరణించారని వెల్లడించింది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..