Corona Positive Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, కోవిడ్-19తో తాజాగా 23 మంది మృతి
Telangana Corona Positive Cases: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ సహా దాదాపు 8 రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ సహా దాదాపు 8 రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,567 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,73,468కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,02,235 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 5 వేల 5 వందల నలభై అరవై ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్(CoronaVirus) కేసుల సంఖ్య 3 లక్షల 73 వేల 4 వందల అరవై ఎనిమిదికి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 23 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,899కి చేరింది. తెలంగాణ సర్కార్ గత కొన్ని రోజులుగా 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: Ashish Yechury Death News: కరోనాతో సీపీఎం నేత Sitaram Yechury కుమారుడు మృతి
రాష్ట్రంలో అత్యధిక కోవిడ్-19(COVID-19) పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. GHMC పరిధిలో తాజాగా 989 కరోనా కేసులు నిర్ధారించారు. అయినా కొన్ని చోట్ల ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతూ జరిమానాకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 49 వేల 781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,21,75,425 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 2,251 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,21,788 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్19 నిబందనలు పాటిస్తే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చునని సూచిస్తున్నారు. ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Also Read: Covisheild Vaccine Price: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook