Telangana Corona Updates: తెలంగాణలో ఒక్కరోజులో 8 వేల కరోనా కేసులు, తాజాగా 58 మంది మృతి

COVID-19 Positive Cases In Telangana | తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ సర్కార్ సైతం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తోంది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ సర్కార్ సైతం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. అయినా కరోనా కేసులు తగ్గకపోగా, భారీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,994 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 80,181 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 7 వేల 9 వందల 94 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 27 వేల 9 వందల 60కు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో తాజాగా 58 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా(CoronaVirus) మరణాలు 2,208కి చేరింది. ఈ వారం ప్రతిరోజూ దాదాపు 8 వేల వరకు కోవిడ్19 పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
Also Read: COVID-19 నుంచి రికవరీ అయినవాళ్లు తీసుకోవాల్సిన Food, ఇతర జాగ్రత్తలు
తాజా కేసులలో GHMC పరిధిలోనే 1,630 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 76 వేల 060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,28,28,763 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు గురువారం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారు 81.71 శాతం ఉన్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) బారి నుంచి 4,009 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,49,692 మంది కరోనా మహమ్మారిని జయించారు.
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 45 ఏళ్లు పైబడిన వారు అప్పటిలోగా టీకాలు తీసుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్19 నిబంధనలు పాటించని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook