తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పట్టుమని పదేళ్లు కూడా లేని కౌశిక్ గుండెపోటుకు గురై మరణించాడు. ఆశ్యర్యపోతున్నారా..నిజమే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో జరిగింది ఈ ఘటన. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9 ఏళ్ల కౌశిక్..మూడో తరగతి చదువుతున్నాడు. అప్పటివరకూ తోటి విద్యార్ధులతో ఆడుకున్నాడు. మద్యాహ్నం భోజన విరామం సమయంలో క్యూలైన్‌లో ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. ఏ జరిగిందో తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ఉపాధ్యాయుడి వాహనంలోనే కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే గుండెపోటుతో మరణించాడని వైద్యులు ధృవీకరించారు. ఈ బాలుడు గత కొద్దికాలంగా ఫిట్స్, హార్ట్ వీక్‌తో బాధపడుతున్నాడని తెలిసింది. 


అంత చిన్నపిల్లాడికి గుండెపోటు రావడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. చిన్న వయస్సులో గుండెపోటుకు గురవడంపై షాక్‌‌కు లోనవుతున్నారు అంతా.


Also read: Munugode Elections: మునుగోడులో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఎన్ని కోట్లంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook