South Central Railway GM Arun Jain: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎంపీ ఎన్నికలకు ముందు కీలక మైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్ లో.. 2 లక్షల 52 వేల కోట్లను రైల్వేశాఖకు కేటాయించిందని జీఎం అరుణ్ కుమార్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా బడ్జెట్ లో మూడు కారిడార్లకు రైల్వే ప్రాధాన్యత ఇచ్చింది. విద్యుత్ , మినరల్స్,  సిమెంట్ కారిడార్స్ , పోర్టుల కనెక్టవిటి, రద్దీ ఎక్కువగా ఉండే రూట్ల అభివృద్ధి కి నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.  ఇక .. సౌత్ సెంట్రల్ రైల్వే కు  14 232 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. ఈ బడ్జెట్ లో ఇరు తెలుగు రాష్ట్రాలలో బడ్జెట్ కేటాయింపులలో భారీగా పెరుగుదల ఉందన్నారు.


Read Also: Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో మరో గుడ్ న్యూస్.. 40 వేల బోగీలను వందే భారత్ రైళ్లలా అప్ గ్రేడ్..


గత బడ్జెట్ తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల కు 14.7,  8.7 శాతాల బడ్జెట్ పెరుగుదల గా ఉంది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో తెలంగాణకు 5071 , ఆంధ్రప్రదేశ్ కు 9138 కోట్ల కేటాయింపులు జరిగాయని జీఎం అరుణ్ కుమార్ తెలిపారు.  ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్,  ఎక్స్టెన్షన్ కు 60 కోట్ల కేటాయింపులు జరిగాయన్నారు. కవచ టెక్నాలజీ ఏర్పాటుకు కోసం 42 కోట్ల బడ్జెట్  కేటాయించింది.


2023-24 లో 22.4 కోట్ల మంది scr జోన్ లో  ప్రయాణం చేశారు.   డబ్లింగ్, బై పాస్ లైన్ల కోసం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. సేఫ్టీ కి సంబంధించిన లెవెల్ క్రాసింగ్, బ్రిడ్జి లు , రైల్వే అండర్  అండర్ బ్రిడ్జి లకు యధావిధిగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు.  ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు యధావిధిగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని జీ ఎం అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook