తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలను సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలను సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సంవత్సరం తెలంగాణలో మొత్తం 5,34,726 మంది రెగ్యులర్ విద్యార్థులు, 25,763 ప్రైవేటు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా అందులో 83% ఉత్తీర్ణత సాధించారు.
అయితే ఈ పదో తరగతి ఫలితాల్లో బాలల కన్నా బాలికలదే ఎక్కువ హవా కొనసాగడం విశేషం. 2017లో 84% విద్యార్థులు విజయం సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించబడ్డాక, రెండు రాష్ట్రాలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి.. వేరు వేరుగా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించాయి. అలాగే ఒకప్పుడు ఉన్న మార్కుల విధానానికి స్వస్తి చెప్పి... విద్యార్థులకు సబ్జెక్టుల్లో గ్రేడులనే ఈ బోర్డులు అందిస్తున్నాయి.
తెలంగాణలో ఇటీవలే రాష్ర్టవ్యాప్తంగా జరిగిన పదవి తరగతి పరీక్షల్లో 2125 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కాగా 21 పాఠశాలలు మాత్రం జీరో పర్సెంట్ ఉత్తీర్ణత నమోదు చేయడం గమనార్హం. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా చివరిస్థానంలో ఉంది. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.