హైదరాబాద్‌: తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 29ని చివరి తేదీగా పేర్కొంటూ ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండానే అక్టోబరు 29 వరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.24 వేల కన్నా తక్కువ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల కన్నా తక్కువగా ఉన్న విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 


పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు పొందాలనుకునే విద్యార్థిని, విద్యార్థులు తాజాగా జారీచేసిన ఆధాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.