SSC exams : 10వ తరగతి పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు. ఉదాహరణకు 8వ తేదీ పరీక్ష రాస్తే మళ్లీ 10వ తేదీన పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల వ్యవధిలో అన్ని పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు, ఇన్విజిలేషన్ సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ ( thermal screening ) నిర్వహిస్తారు. ( సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్.. లాక్‌డౌన్ కొనసాగింపుపైనే చర్చ )
విద్యార్థులు తెలుసుకోవాల్సినవి:
విద్యార్థులు చేతులకు గ్లౌజ్, ముఖానికి మాస్క్ కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇంతకు ముందు ఉన్న పరీక్ష కేంద్రాలకు బదులు తాజాగా పరీక్ష కేంద్రాలను పెంచారు. ఒక క్లాస్ రూమ్‌లో కేవలం పన్నెండు మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెడతారు. పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతారు. ఒక విద్యార్థితో పాటు పరీక్ష కేంద్రం వరకు ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. అది కూడా కచ్చితంగా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సుల్లో కూడా సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. కేవలం పరీక్ష రాసే విద్యార్థులను మాత్రమే ఈ బస్సుల్లో అనుమతిస్తారు. ఒకవేళ విద్యార్థుల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే.. అలాంటి విద్యార్థులను వేరే గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తారు. ( Read also : Kondapochamma Sagar : రైతులకు గుడ్ న్యూస్ : సీఎం కేసీఆర్ )
నిజానికి మార్చిలోనే పరీక్షలు ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం లాక్ డౌన్ విధించింది. దీంతో పరీక్షలు ఆపాలని తెలంగాణ హై కోర్టు ప్రభుత్వానికి సూచించింది. మొత్తానికి లాక్ డౌన్‌కు కొంత ఉపశమనం దొరికిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..