Bandi Sanjay's Bail: హన్మకొండ: పదో తరగతి హిందీ పేపర్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయించాలని చూసిన వరంగల్ పోలీసులకు హన్మకొండ కోర్టులో చుక్కెదురైంది. బండి సంజయ్ బెయిల్‌ని రద్దు చేయాలని కోరుతూ వరంగల్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు, బండి సంజయ్ తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బండి సంజయ్ బెయిల్ పై బయట ఉంటే, టెన్త్ పేపర్ లీకేజీ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న నిందితులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను ఖండించిన బండి సంజయ్ తరపు న్యాయవాదులు.. బండి సంజయ్‌పై రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని.. ఈ కారణంగానే ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని బండి సంజయ్‌ను నిందితుడిగా చూపించి జైల్లో పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కోర్టుకు తెలిపారు.


టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని బండి సంజయ్ తరపు న్యాయవాదులు ఎల్. రవించందర్, కరుణా సాగర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా, ఇప్పటికే బండి సంజయ్ తన మొబైల్ ఫోన్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆ చోరీకి గురైన ఫోన్ నే తమకు స్వాధీనం చేసి విచారణకు సహకరించాలంటూ పోలీసులు నోటీసులు జారీచేయడం కక్షసాధింపు కిందకే వస్తుందని బండి సంజయ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బండి సంజయ్ ఫోన్ చోరీకి గురైంది అని పోలీసులకు ఫిర్యాదు అందినప్పటికీ.. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని బండి సంజయ్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.


ఆర్టికల్ 23 ప్రకారం, ఎవరైనా ఒక నేరస్తునిపై ఏదైనా నేరారోపణల కింద అభియోగాలు నమోదైతే.. ఆ ఆరోపణలను నిరూపించేందుకు అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపాలే తప్ప బెదిరింపులకు పాల్పడటం అంటే రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కులను కాలరాయడమే అవుతుంది అని బండి సంజయ్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇలా సుధీర్ఘ విచారణ అనంతరం బండి సంజయ్ బెయిల్ రద్దు పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్టు హన్మకొండ కోర్టు స్పష్టంచేసింది.


ఇది కూడా చదవండి : Revanth Reddy Appeal to Muslims: ముస్లింలు ఎవరి పక్షం.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


ఇదిలావుంటే, బండి సంజయ్ ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలుగు ఓటర్ల శాతం అధికంగా ఉన్న చికబళ్లాపూర్ జిల్లాలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కర్ణాటక ఎన్నికల బరిలో దిగిన మునిరాజుతో కలిసి బాగేపల్లి నేషనల్ కాలేజీ నుండి బస్టాండ్ వరకు జరుగుతున్న ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్.. బాగేపల్లి బస్టాండ్ సెంటర్లో ప్రసంగించనున్నారు.


ఇది కూడా చదవండి : Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో నిమ్మకాయలు.. నన్ను బలిస్తారేమో అనుకున్నా: బండి సంజయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK