నేడే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడి
నేడే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్, విద్యాభవన్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన అనంతరం https://tsbie.cgg.gov.in లేదా www.ntnews.com వెబ్‌సైట్స్ ద్వారా ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు.
అధికారులు చేసిన ఈ ప్రకటనతో గత కొద్దిరోజులుగా ఇంటర్ ఫలితాల విడుదలపై కొనసాగుతూ వస్తోన్న సందిగ్ధత తొలగిపోయింది.