Harish Rao: తెలంగాణలో గతంలోఎన్నడూ లేనివిధంగా వరదలు సంభవించాయన్నారు మంత్రి హరీష్‌రావు. ఈసారి గోదావరి నదికి 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. 500 ఏళ్లల్లో ఇది అతిపెద్ద వరద అని చెప్పారు. వరదలపై బురద రాజకీయం చేసే పార్టీలు తెలంగాణలో ఉన్నాయని విమర్శించారు. ఇది ప్రకృతి వైపరిత్యం తప్ప మానవ తప్పిదం కాదని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసత్య ప్రచారం తగదన్నారు మంత్రి హరీష్‌రావు. రెండు పంపులు మునిగితే లక్ష కోట్ల ప్రాజెక్ట్ మునిగిందని అనడం ఏంటన్నారు. ఇక నీళ్లు రావు అని ప్రచారం చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సస్యశ్యామలం చేశామని స్పష్టం చేశారు. వరదలు ముమ్మటికి ప్రకృతి వైపరిత్యమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏది జరిగినా పూర్తి బాధ్యత ఏజెన్సీదేనని తేల్చి చెప్పారు.


మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదన్నారు. అన్నారం పంప్‌ హౌస్‌ను ఈనెల మూడో వారంలో, అక్టోబర్ నెలాఖరులో మెడిగడ్డ ప్రారంభిస్తామని తెలిపారు. యాసంగికి రైతులకు ఎంత నీరు కావాలంటే అంతా ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చిందని..కానీ కేంద్రమంత్రులు ఏ అనుమతులు లేవని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ పూర్తి కాలేదని మొన్న ఓ కేంద్రమంత్రి చెప్పారని..డీపీఆర్ లేకపోతే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేగంగా అనుమతులు ఇచ్చామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని గుర్తు చేశారు. ఐనా బీజేపీ నేతలు..కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదంటున్నారు. మళ్లీ తమ నియోజకవర్గంలో నీరు విడుదల చేస్తారని ఇదేం పద్ధతి అని అన్నారు.


ఇవాళ్టీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. వర్షకాల అసెంబ్లీ సమావేశాలు మూడురోజులపాటు సాగనున్నాయి. శాసన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంత్రి హరీష్‌రావు స్పష్టత ఇచ్చారు. ప్రాజెక్ట్‌పై ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు.


Also read:నిర్మాతల తీరుతో మనస్థాపం.. ప్రమోషన్స్ కు డైరెక్టర్ డుమ్మా!


Also read:Asia Cup 2022: అన్ని వదిలిపెట్టు..దేశం కోసం ఆడు..అర్ష్‌దీప్‌కు మహమ్మద్ షమీ సలహా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి