హైదరాబాద్: గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్‌లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతమయ్యింది. తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి వంటి ప్రతీకలను చేర్చి, అద్భుతంగా రూపొందించిన శకటం ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది. గిరిజన కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను చాటి చెప్పేలా గోండు, తోటి, కొమ్ముకోయ, బంజారా కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐదు సంవత్సరాల తర్వాత మరోసారి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్రం వచ్చాక శకటాన్ని ప్రదర్శించడం ఇది రెండవసారి.  కాగా 9 రోజుల పాటు ఘనంగా సాగే బతుకమ్మ పండుగతో పాటు తెలంగాణ కుంభమేళా మాదిరిగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మ వైభవం చాటేలా శకటాన్ని తయారు చేశారు. దీంతో పాటు కాకతీయ చరిత్రను ప్రతిబింబించేలా వెయ్యి స్థంభాల గుడిని సైతం అందంగా రూపొందించారు. 


మరోవైపు ఆంధ్రపదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం బాలాజీ సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల మహాత్యాన్ని చాటాయి. శకటంపై రూపొందించిన తిరుమల తిరుపతి గర్భగుడి, బ్రహ్మోత్సవం.. బ్రహ్మోత్సవం అంటూ సాగిన సంకీర్తన గణతంత్ర వేడుకల్లో అద్భుతమైన ఆధ్యాత్మిక భక్తి పారవశ్యాన్ని చూపించాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..