హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను మే 13న అంటే రేపటి సోమవారం వెల్లడించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ స్పష్టంచేసింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు. విద్యా శాఖ కార్యదర్శి జనార్థన్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. 


ఇటీవల ఇంటర్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న గందరగోళం కారణంగా 23 మంది విద్యార్థిని, విద్యార్థులు అర్థాంతరంగా తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 10వ తరగతి ఫలితాల వెల్లడిలో అటువంటి గందరగోళం పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.