TS TET 2022:  తెలంగాణలో కొలువల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పోలీస్ శాఖ సహా పలు శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తైంది. విద్యాశాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ కంపల్సరీ. దీంతో ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 12న పరీక్ష జరగగా... జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కాని ఇంతవరకు ఫైనల్ కీ రిలీజ్ కాలేదు. ప్రభుత్వం చెప్పిన గడువు ప్రకారం సోమవారం ఫలితాలు రావాల్సి ఉండగా.. ఇంకా ఫైనల్ కీ రాకపోవడంతో ఫలితాలు విడుదల అనుమానంగానే కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెట్ నోటిఫికేషన్ లోనే జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత వారం కూడా ఇదే ప్రకటన చేశారు. కాని ఇప్పుడు మాత్రం సమయానికి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న టెట్ పరీక్ష జరిగింది. ఉదయం పేపర్ 1.. మధ్యాహ్నాం పేపర్ 2 నిర్వహించారు. జూన్ 15  న ప్రాథమిక కీ విడుదల చేశారు 18 వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించారు. టెట్ పరీక్షా పేపర్లు చాలా తప్పులు దొర్లాయి. దీంతో అభ్యర్థుల నుంచి భారీగానే అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలించి తుది కీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ కీ వచ్చాకే ఫలితాలు విడుదల చేశారు. కాని అధికారులు ఇప్పటి వరకూ టెట్ ఫైనల్  కీ  విడుదల చేయకపోవడడంతో సోమవారం ఫలితాలు వస్తాయా రావా అన్న అనుమానంలో అభ్యర్థులు ఉన్నారు.


ప్రాథమిక కీ టెట్ పేపర్ 1 లో 5  సమాధానాలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పేపర్ 2 లోని ఫైనల్ కీ 5 సమాధానాల్లోనూ తప్పులు ఉన్నాయని చెబుతున్నారు. ఫైనల్ కీలో ఈ మార్పులు చేశారా లేదా అని అభ్యర్థులు అనుమానిస్తున్నారు. టెట్ ఫైనల్ కీ వెంటనే విడుదల చేయలని డిమాండ్ చేస్తున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. అందుకే టెట్ పరీక్ష చాలా కీలకం. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.


Read also: Teachers Assets Declaration: టీచర్ల ఆస్తుల లెక్కలపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు 


Read also: Telangana Rainfall Updates: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. నేటి వర్షపాతం వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.