Telangana Vimochana Dinotsavam 2022: తెలంగాణ విమోచన దినోత్సవం.. ఈసారి కేంద్రం చేతుల మీదుగా
Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచన దినాన్ని ఈసారి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపి ముందు నుంచీ డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచన దినాన్ని ఈసారి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపి ముందు నుంచీ డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపి అధికారంలోకి వస్తే.. తామే ఆ పని చేస్తాం అని కూడా చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడుతూ వస్తోన్న ఈ కార్యక్రమాన్ని తామే చేసి చూపిస్తామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు జారీచేశారు.
అమిత్ షా సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిథులుగా
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన సందర్భాన్ని, అందుకు కృషి చేసిన సాయుధ పోరాట అమరవీరులను స్మరించుకుంటూ ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైలు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.
కేంద్రం నిర్ణయంపై కేసీఆర్ ఏమంటారు..
తెలంగాణలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలోనే ఇప్పుడిలా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించే బాధ్యతను కేంద్రం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చనే వార్తల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ విమోచన దినం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆందోళన చెందుతున్న వారి దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెబుతున్న వాళ్లు కూడా లేకపోలేదు. సాదారణంగానే కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండే సీఎం కేసీఆర్ (CM KCR).. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తారోననేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Also Read : KCR PLAN: కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్.. ఒకే రోజున కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్.. సంచలనం జరగబోతోందా?
Also Read : KTR slams FM Nirmala Sitharaman: నడి రోడ్డుపై జిల్లా కలెక్టర్‌తో వ్యవహరించే తీరిదేనా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి