Telengana Weather: రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత.. ప్రజలను అప్రమత్తం చేస్తున్న వాతావరణ శాఖ..!
Weather Today: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో , ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.
Telengana Weather update: నిన్న మొన్నటి వరకు అకాల వర్షాలతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. తినడానికి తిండి లేకుండా, ఎంతోమంది ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు.ముఖ్యంగా పిల్లలకు తాగడానికి పాలు లేక, వృద్ధులకు సరైన సమయానికి ఆహారం , టాబ్లెట్స్ లభించక చనిపోయిన వారు కూడా ఉన్నారు.
ఇక ఆ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రజలకు మరో ఆటంకం వచ్చి పడింది. అదే చలి తీవ్రత. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజుకు పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి ప్రభావం ఎక్కువ అవుతుంది.
ముఖ్యంగా పెద్దలు, పిల్లలు జబ్బుల బారిన పడుతున్నారు. ఇకపోతే సోమవారం సైతం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి ప్రాంతంలో 12.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు అదే జిల్లాకు చెందిన సిర్పూర్ (యు) లో 12.3, వాంకిడి లో 12.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అలాగే ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ జిల్లాలలో కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకి రావద్దని,ఒకవేళ వచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుండి 13 డిగ్రీలలో పైన మోదు కావడం గమనార్హం.
రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలలో కూడా ఉష్ణోగ్రతలు 13 నుండి 15 డిగ్రీల స్థాయికి పడిపోయాయి. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, రంగారెడ్డి జిల్లా చందన్వెళ్లి లో కూడా వరుసగా రెండో రోజు 12.2° కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేతులు, కాళ్లు శరీరంతో పాటు చెవులను కూడా కప్పి ఉంచుకోవాలని, లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు చలి తీవ్రత.. పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం కూడా మొదలవుతుందని కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.