Telangana Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనాల కారణంగా ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. రానున్న 3 రోజులు, వచ్చే 24 గంటలు వాతావరణం ఎలా ఉంటుందో వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. ఇది నైరుతి వైపుకు వంగి ఉంది. ఫలితంగా రాగల 24 గటంల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అదిలాబాద్, సిద్దిపేట, జనగాం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 


ఈ సీజన్‌లో తెలంగాణలో సాధారణాన్ని మించి వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 70.36 సెంటీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంటే 91.90 సెంటీమీటర్లు కురిసింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ నెలతో నైరుతి ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగియనుంది. 


Also read: Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూ వివాదం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు అసలు జరిగిందేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.