Telangana Weather Forecast, Rains to hit Telangana State for next 2 days: నైరుతి రుతుపవనాల కారణంగా మండు వేసవిలో దేశంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రుతుపవనాల కారణంగా గత నెల రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ చోట అత్యధిక ఉష్ణోగ్రత నమోదైతే.. మరోచోట వర్షం ముంచెత్తుతోంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని రాయలసీమ ప్రాంతంపై 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 


శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్‌లో 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఫిబ్రవరి తరవాత 24 గంటల వ్యవధిలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడం ఇదే మొదటిసారి. మరోవైపు శనివారం కుమురం భీం జిల్లా కౌటాలలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. 


Also Read: Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, మరోసారి పెరిగిన బంగారం ధర, మే 22 ఇవాళ్టి బంగారం ధరలు


Also Read: DC vs MI: ఢిల్లీ కేపిటల్స్ ఓటమికి కారణం రిషభ్ పంత్ తప్పుడు నిర్ణయమేనా, రిషభ్‌పై విమర్శలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook