Telangana weather: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో చలికి వణుకుతున్న ప్రజలు..!
Telangana weather update: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో..ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, కూలీలు అవస్థలు పడుతున్నట్లు సమాచారం. గత రెండు మూడు రోజులగా చలితీవ్రత ఎంతో పెరిగింది. ఈ క్రమంలో ఇది మరింత ఎక్కువ పెరగనుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Telangana weather today: అడవుల జిల్లాగా పేరు దక్కించుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పులి విసిరిన పంజాకు ప్రజలు వణికిపోతున్నారు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు చలికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఆదిలాబాద్‌లో 13.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత..
మెదక్‌లో 16.6 డిగ్రీలు, హకీంపేట్‌లో 16.4డిగ్రీలు, పటాన్‌చెరులో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే నిజామాబాద్, హైదరాబాద్‌లో 18.00 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.
ఇక రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యుక్త వయసు వారు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా సరే ఇంటి నుండి కాలు బయటకు పెట్టేందుకు జనం వెనుకడుగు వేస్తున్నారు. అటు సాయంత్రం ఐదు గంటలు కాగానే చీకటి పడుతుండడం దీనికి తోడు చలి కూడా తీవ్రం అవ్వడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా శీతల గాలులు ప్రజలను అనారోగ్యానికి కూడా గురి చేస్తున్నాయి. చలి తీవ్రతను తట్టుకోలేక ప్రజలు గుంపుగా చేరి చలిమంటలు వేసుకుంటూ కాస్త వేడిని పొందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరాది నుండి వేస్తున్న శీతల గాలుల కారణంగా జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ అవుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పెరిగిన చలి తీవ్రత నుండి తమను కాపాడుకునేందుకు ప్రజలు చలిమంటలు వేసుకుంటుండగా మరొకవైపు ఉదయం పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు కూడా అవస్థలు పడుతున్నారు.
ఇక ఉద్యోగాలకు వెళ్లే వారు కూడా తెగ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం పొగ మంచు కొమ్ముకోవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రయాణికులు కూడా అవస్థల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల వేళలు మార్చాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also Read: YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్ జగనన్న అంటే అంత కోపమా?
Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్ షర్మిల ప్రశ్నలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook