Telangana Weather Updates: తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో అల్పపీడన ప్రదేశ ఏర్పడనుందని.. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Heavy Rains in Telangana: దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం సోమవారం బలహీన పడింది. ఈ రోజు కూడా షీయర్ జోన్ 20°N ఆక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. దక్షిణ ఒడిస్సా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసరాలలోని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటలలో ఒక అల్పపీడన ప్రదేశం ఏర్పడనుంది. దక్షిణ ఒడిస్సా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాలలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఈ అల్పపీడనం ఈ నెల 26న వాయుగుండంగా బలపడి అవకాశం ఉందని తెలిపారు. ఈ వాయుగుండం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్రప్రదేశ్-దక్షిణ ఒరిస్సా తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీవర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రానున్న 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!
Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి