Telangana Weather Updates: నిప్పుల కొలిమిగా రాష్ట్రం, 29 జిల్లాల్లో రెడ్ అలర్ట్, అత్యధికంగా 46.7 డిగ్రీలు
Telangana Weather Updates: తెలంగాణలో నిప్పుల కుంపటే రగులుతోంది. రోజురోజుకూ ఎండలు తీవ్రత పెరిగిపోతోంది. భగభగమండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మంధనిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండల ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సరాసరిన 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత కన్పిస్తోంది. తెలంగాణలోని తూర్పు, ఉత్తర జిల్లాల్లో మాత్రం 46 డిగ్రీలు దాటి నమోదైంది. రానున్న 4-5 రోజులు పరిస్థితి ఇలానే ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో నమోదైన అత్యధిక ఉష్ణోగర్తలు
తెలంగాణ వ్యాప్తంగా నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఓ వైపు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, మరోవైపు తీవ్రంగా వీస్తున్న వడగాల్పులతో జనం విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మిలో అత్యధికంగా 46.7 డిగ్రీలు నమోదైంది. ఇక నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెం, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 46.6 డిగ్రీలు రికార్డ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల అత్యదికంగా 46 డిగ్రీలు దాటింది.
నిర్మల్, మహబూబ్ నగర్, మేడ్చల్, నిజామాబాద్, కుమరం భీం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలు దాటింది. ఇక అదిలాబాద్, మెదక్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 44 డిగ్రీలు దాటి నమోదైంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ అత్యధికంగా 44 డిగ్రీలు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది.
ఎన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్
పైన ఉదహరించిన అన్ని ప్రాంతాల్లోనూ గత ఏడాది ఇదే సమయానికి 35 నుంచి 38.7 డిగ్రీలే నమోదవడం గమనార్హం. అంతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా నమోదైన పరిస్థితి కన్పిస్తోంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే రెడ్ ఎలర్ట్ జారీ అవుతుంది. అదే 40-45 డిగ్రీల మధ్యలో ఉంటే ఆరెంజ్ ఎలర్ట్ ఉంటుంది. 35-40 డిగ్రీల మధ్యలో ఉంటే ఎల్లో అలర్ట్ జారీ అవుతుంది. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా 29 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. 4 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Also read: Uttam kumarreddy: బీఆర్ఎస్ పని ఖతం.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook