హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఏర్పాటైన తెలంగాణ అసెంబ్లీ ఇవాళ తొలిసారి సమావేశమైంది. సభ ప్రారంభంలోనే కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయగా ఆ తర్వాత ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో మొత్తం 114 మంది ప్రమాణస్వీకారం చేయగా మరో ఐదురుగు సభ్యులు ఇవాళ సభకు హాజరుకాలేదు. 


సభకు హాజరుకాని వారిలో అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్ ఉన్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.