Jitta Balakrishna Reddy: బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి అరెస్ట్.. సినీ ఫక్కీలో ఛేజ్ చేసిన పోలీసులు
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు. అర్ధరాత్రి ఆయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జిట్టాను అరెస్ట్ చేసే క్రమంలో అర్ధరాత్రి పెద్ద హైడ్రమా నడిచింది.
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు. అర్ధరాత్రి ఆయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జిట్టాను అరెస్ట్ చేసే క్రమంలో అర్ధరాత్రి పెద్ద హైడ్రమా నడిచింది. జిట్టా వెళుతున్న వాహనాన్ని సినిమా ఫక్కీలో ఛేజ్ చేసి మరీ ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించారు జిట్టా బాలకృష్ణ రెడ్డి. ఆ సభలో కేసీఆర్ ను కించపరిచే విధంగా స్కిట్ వేయించారని జిట్టా పైనా ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ నేతలు. దీంతో జిట్టాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే జిట్టాను అరెస్ట్ చేశారు పోలీసులు. జిట్టాను ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయంపై ఆయన అనుచరులకు సమాచారమివ్వలేదు పోలీసులు. జిట్టాను తీసుకువెళుతున్న పోలీసుల వాహనాన్ని అతని అనుచరులు మరో వాహనంలో ఫాలో అయ్యారు. అయితే వనస్థలిపురం పనామా గోడౌన్ వద్ద అనుచరుల కళ్లుగప్పి జిట్టాను తీసుకెళ్లారు పోలీసులు.
తన అరెస్ట్ సమయంలో పోలీసులను నిలదీశారు జిట్టా బాలకృష్ణ రెడ్డి. ఎలాంటి నోటీసులివ్వకుండా అదుపులోకి తీసుకోవడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్యబద్దంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకునే హక్కులేదా? అని నిలదీశారు.జిట్టాను అర్దరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులివ్వకుండా అర్దరాత్రి హంతకుడు, దోపిడీ దొంగల మాదిరిగా కిడ్నాప్ చేశారని మండిపడ్డారు. అర్దరాత్రి జిట్టా బాలక్రిష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ కార్యకర్తలు, జిట్టా అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిట్టాకు ఏం జరిగినా కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Read also: JOB News: యవతకు గుడ్‌న్యూస్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో త్వరలో 90 వేల ఉద్యోగాల భర్తీ
Read also: Indian Presidential Election-2022: రాష్ట్రపతి ఎన్నికకు వేళాయే..ఈసారి ప్రత్యేకతలేంటో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook