Weather news: తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా... భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
Weather Updates: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అత్యల్పంగా వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Weather Updates: తెలుగు రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. ఈశాన్య దిశ నుంచి శీతలగాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు (Temperature in telugu states) కనిష్టస్థాయికి పడిపోయాయి. తెలంగాణలోని (Telangana) 15 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఏపీలోని (Andhra Pradesh) అనంతపురం జిల్లా మడకశిరలో 12.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణపై ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
దీంతో శని, ఆది, సోమవారాల్లో నారాయణపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిగతా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Medaram Jatara : మేడారం జాతర కోసం TSRTC ప్రత్యేక యాప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook