Tenth class students attack with knife on class mate : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో విద్యార్థులు రెచ్చిపోయారు. దుర్గాప్రసాద్‌ అనే పదో తరగతి విద్యార్థిపై మరో ఇద్దరు స్టూడెంట్స్‌ కత్తులతో దాడి చేశారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌ లో పార్టీ చేసుకున్న పలువురు విద్యార్థులు.. అక్కడి నుంచి దుర్గాప్రసాద్‌ ను అత్తాపూర్‌ కు తీసుకెళ్లి కత్తులతో దాడి చేశారు. బాధితుడు కేకలు వేయడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు దుర్గాప్రసాద్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాడి దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. తన గర్ల్‌ ఫ్రెండ్‌ కు హాయ్‌ చెప్పాడని అక్కసుతోనే ఈ దాడికి పాల్పడ్డని పోలీసులు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook