Sankranti Holidays: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..! సంక్రాంతి సెలవులు ఇవే..
Ts Sankranti Holidays: తెలంగాణ సర్కార్ బడి పిల్లలకు సంక్రాతి సెలవులపై స్పష్టతని ఇచ్చింది. వరుసగా 6 రోజుల పాటు హాలిడేస్‌ను డిక్లేర్ చేసింది. దీంతో సూల్క్కు ఎప్పుడు సెలవులు ఇస్తారా..? అని ఎదురు చేస్తున్న విద్యార్థుల ఎదురుచూపులకు చెక్ పడింది. ఎప్పటి నుంచి ఎప్పటివరకు సెలువులున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Ts Sankranti Holidays: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈసారి వరుస ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చింది. సంక్రాంతి పండుగ సందర్బంగా తెలంగాణ విద్యాశాఖ సెలవుల తేదీలను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు పండుగ సెలవుల తేదీలను అనౌన్స్ చేసింది. జనవరి 13న 2వ శనివారం కాగా.. 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలతో పాటు అదనంగా జనవరి 17న విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. తిరిగి 18వ తేదీన విద్యాసంస్థలు యథావిధిగా తెరుచుకుంటాయి.
Also Read: Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం.. బావబామ్మర్దులు దూకుడు
అంతేకాకుండా విద్యార్థులకు డబుల్ ఆనందం కలిగించే మరో విషయం ఎంటి అంటే సంక్రాతి సెలవులతో పాటు జనవరి 7, 14, 21, 28 ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి. మొత్తానికి ఈనెలలో దాదాపు సగం రోజులు స్కూళ్లకు సెలవులు ఉన్నాయని చెప్పవచ్చు. తెలంగాణ సర్కార్ సూళ్లకు సెలవుల ఇవ్వటంతో సంకాంత్రి పండగకు సొంతూళ్లకు వెళ్లేవాళ్లు సిద్ధమవుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లలో రద్దీ పెరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter