Bandi Sanjay: `ప్రగతి భవన్లో సీఎం కూర్చీ కోసం నాలుగు స్తంభాలాట`
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సీఎం కూర్చికోసం నాలుగు స్తంబాల ఆట ప్రారంభమైందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ మళ్లి అధికారంలోకి వచ్చే అకాశం లేదని జోస్యం చెప్పారు.
Bandi Sanjay Comments on CM KCR, TRS party: తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌పై మరోసారి విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ టూర్‌ను ప్రస్తావిస్తూ.. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని పేర్కొన్నారు. ఢిల్లీ టూర్ ప్రజల దృష్టి మళ్లించేందుకేనని (Bandi Sanjay fires on KCR) విమర్శించారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీకి ప్రజలు రుణ పడ్డారు..
కరోనా వ్యాక్సిన్ విషయంలో మోదీ నిర్ణయాల వల్ల ప్రస్తుతం దేశంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయన్నారు బండి సంజయ్. ప్రధాని మోదీ(Bandi Sanjay on PM Modi), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ ఆదేశాలతో దేశవ్యాప్తంగా, తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు బండి సంజయ్. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించినట్లు వివరించారు. దీని వల్లే ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజలు మోదీకి రుణ పడ్డారని తెలిపారు. కేంద్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే.. రాష్ట్రంలో మరో విధమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు సంజయ్. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు కుటుంబ పాలనను సహించే పరిస్థితుల్లో లేరని చెప్పుకొచ్చారు.
అనేక మంది ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ సాధ్యమైందని.. అయితే ఇప్పుడు తెలంగాణ తల్లి బంధిగా మారిందని చెప్పుకొచ్చారు సంజయ్. త్వరలోనే ఆ తల్లికి విముక్తి లభిస్తుందని.. అది బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమని ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోర్యం చెప్పారు బండి సంజయ్. ప్రస్తుతం ప్రభుత్వం ఉంటుందా లేదా కుడా (Bandi Sanjay on TRS Party) తెలియదన్నారు. ప్రశ్నించే గొంతుకను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారని..అందుకు ఉదాహరనే ఈటెల రాజేందర్ అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో సీఎం కుర్చీకోసం.. కుర్చీలాట, నాలుగు స్తంబాలాట ప్రారంభమైందన్నారు బండి సంజయ్. కుమారుడు, బిడ్డ, అల్లుడు తమను ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తావంటూ ప్రశ్నిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ వ్యవహారాల సంస్థాగత ఇన్‌ఛార్జి శివప్రకాశ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ, ఎమ్మెల్యే ఈటర రాజేందర్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Also read: TS EAMCET 2021 : తెలంగాణ ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది
Also read: Massive Traffic Jam: హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్-4కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook