QR Code On Electricity Bill: టీజీఎస్‌పీడీసీఎల్‌ విద్యుత్‌ వినయోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక పై వినియోగదారులకు బిల్లు చెల్లింపుల్లో అవస్థలు పడకుండా సులభతరం చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇంతకు ముందు కరెంటు బిల్లులు చెల్లించాలంటే ఏ ఫోన్‌ పే గూగుల్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్‌లను విస్త్రతంగా ఉపయోగించి బిల్లు కట్టేవారు. ఇది వినియోగదారులకు ఎంతో సులభం కూడా అనిపించేది. అయితే, ఇటీవల థర్డ్‌ పార్టీ జోక్యాన్ని తగ్గించాలనే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ దృష్ట్యా బిల్లు చెల్లింపులు థర్డ్‌ పార్టీ యాప్‌ ద్వారా ఇప్పుడు కుదరవని ఆదేశించింది. అయితే, ఇది విద్యుత్‌ వినియోగదారుల్లో ఇది కాస్త అయోమయానికి గురిచేసింది. కొందరు కరెంటు ఆఫీసుకు వెళ్లే బిల్లు చెల్లింపులు చేయాలా? అనే ఆందోళనకు గురయ్యారు. అయితే, టీఎస్‌పీడీసీఎల్‌ యాప్‌ ద్వారా కూడా కరెంటు బిల్లుల చెల్లింపుల వెసులుబాటు కూడా ఉందని ఆరోజే చెప్పింది. అయితే, ఇది కొంతమందికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో కరెంటు బిల్లులపైనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే దిశగా టీజీఎస్‌పీడీసీఎల్‌ చర్యలు చేపట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..


దీంతో సులభంగా బిల్లుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి బిల్లు సులభంగా చెల్లించేయోచ్చు. ఏ నెలకు ఆ నెల బిల్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ అప్డేడ్‌ అవుతుంది. ఇప్పటికే టీజీఎన్‌పీడీసీఎల్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మట్టేవాడ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) వరంగల్‌, భూపాలపల్లిలో అమలు చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌ వ్యాప్తంగా కూడా అమలు చేయనుంది. బిల్లు కింది భాగంలోనే క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మీ ఫోన్‌  డెబిట్‌, క్రెడిట్‌ కార్డు, యూపీఐ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా సులభంగా బిల్లు చెల్లింపులు చేపట్టవచ్చు. ఇది టీజీఎస్‌పీడీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌ కంటే కూడా మరింత సులభం.


ఇదీ చదవండి:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..


ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పేలు పవర్‌ బిల్లు చెల్లింపులను నిలిపివేసింది. అయితే, ఎక్కువశాతం పట్టణాల్లో నివసించే ప్రజలు ఈ థర్డ్‌ పార్టీ యాప్‌లపై ఎక్కువగా ఆధారపడ్డారు. వీరిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు చెందినవారు మీసేవకు వెళ్లి చెల్లింపులు చేస్తారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి