రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
జనగామ: జనగామ-సూర్యపేట హైవేపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వద్ద రెండు కార్లు ఒకదానినొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను పెద్దమడూర్‌కి చెందిన కృష్ణ, జనగామకు చెందిన మణిదిప్, సోమనర్సయ్యగా గుర్తించారు. గాయపడినవారిని జనగామ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. పండగ వేళ జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.