Bhadradri Kothagudem: విషాదం: ఇంట్లో గ్యాస్ లీక్.. కుమార్తె సహా దంపతులు సజీవదహనం!
Gas Leak in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకై... కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు.
Gas Leak in Bhadradri Kothagudem: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) పాత పాల్వంచ తూర్పు బజారులోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై (Gas Leak)... కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు. మంటలు అంటుకొని మరో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే..
రామకృష్ణ..శ్రీలక్ష్మీ (భార్య), తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పాల్వంచలో ఉంటున్నాడు. అక్కడే మీ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇటీవలె దానిని వేరేవాళ్లకి అమ్మేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరం వెళ్లాడు. రెండ్రోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి పాల్వంచకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు (Suicide) పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం రామకృష్ణ కారులోని పత్రాలు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు.
Also Read: Fire accident: కేపీహెచ్బీలో భారీ అగ్నిప్రమాదం- పూర్తిగా కాలిపోయిన థియేటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook