హైదరాబాద్: కోదండరాం ఆధ్వర్యంలోని టీజేఎస్ పార్టీ కాంగ్రెస్ కు సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించింది. వాస్తవానికి టీజేఎస్ ను  9 స్థానాలకే కట్టడి చేయాలని భావించి.. ఆ పార్టీకి కేటాయించే  8 స్థానాల జాబితా విడుదల చేసింది. మరోక స్థానం జనగామను కోదండారంకు కేటాయించాలని నిర్ణయించి దాన్ని హోల్డ్ లో పెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ కట్టడి వ్యూహాన్ని గమనించిన టీజేఎస్ తనదైన శైలిలో స్పందిస్తూ మొత్తం 12 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించింది. ఇంకా అభ్యర్ధుల జాబితా ప్రకటించాల్సి ఉన్నందున చివరి నిమిషంలో మార్పు చేర్పులు ఉండొచ్చని టీజేఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. టీజేఎస్ ప్రకటించిన జాబితాలో  ఆసిఫాబాద్ , మహబూబాబాద్ , స్టేషన్ ఘన్ పూర్ స్థానాలు ఉండటం గమనార్హం. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్,టీడీపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించారు. 


ఈ సందర్భంగా టీజేఎస్ నేత విశ్వేశ్వరరావు మాట్లాడుతూ జనగామతో కలిపి మొత్తం 9 స్థానాలు మాత్రమే కేటాయించారని... మరో మూడు స్థానాలు కావాలని కాంగ్రెస్ ను అడుగుతున్నామని తెలిపారు.  పొత్తులో ఇచ్చుపుచ్చుకోవడం ఉండాలని..కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపాదనను అంగీకరిస్తుందని భావిస్తున్నామని టీజేఎస్ నేత విశ్వేశ్వరరావు పేర్కొన్నారు.


టీజేఎస్ పోటీ చేసే స్థానాలు ఇవే:
దుబ్బాక
మల్కాజ్ గిరి
మెదక్
అంబర్ పేట
సిద్ధిపేట
వరంగల్ తూర్పు
వర్థన్నపేట
ఆసిఫాబాద్ 
జనగామ
మంచిర్యాల
మహబూబ్ నగర్
మిర్యాలగూడ 


స్టేషన్ ఘన్ పూర్


మిత్రబేధాన్ని మరిచిందంటున్న కాంగ్రెస్
మిత్ర బేధాన్ని మరిచి కూటమిలో కాంగ్రెస్,టీడీపీ అభ్యర్ధులను ప్రకటించిన మూడు స్థానాల్లో టీజేఎస్ తమ అభ్యర్ధులను నిలబెట్టేందుకు సిద్ధపడటంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. టీజేఎస్ వ్యహారాన్ని ఢిల్లీలో తేల్చుకోవాలని టి. కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.  టీజేఎస్ వెనక్కి తగ్గితే సరి లేదంటే ..ఆ పార్టీ అభ్యర్ధులపై పోటీకి నిలబెట్టాలని కాంగ్రెస్ బావిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.  తాజా పరిణామాలపై ఉత్కంఠత నెలకొంది. అసలు మహాకూటమిలో టీజేఎస్  కొనసాగుతుందా లేదా అన్న అనుమనాలు కలుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.