దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖులు ఎవరేమన్నారంటే
దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్‌లను ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టడంపై సాధారణ ప్రజానికంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్: దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్‌లను ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టడంపై సాధారణ ప్రజానికంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ సినీ ప్రముఖులను సైతం ఆనందానికి గురిచేసింది. దిశపై నిందితుల అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఆ ఘటనను తీవ్రంగా ఖండించిన సినీ ప్రముఖులు.. ఈ తరహా ఘటనలకు స్వస్తి పలకాల్సిందిగా కోరుతూ సోషల్ మీడియా ద్వారా పలు సందేశాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే తాజాగా దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినప్పుడు సైతం వారి నుంచి పోలీసుల పట్ల అదేవిధమైన సానుకూల స్పందన కనిపించింది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. వాళ్లను ఎన్‌కౌంటర్ చేసి మంచి పనే చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ట్విటర్ ద్వారా స్పందించిన మంచు మనోజ్
ట్విటర్ ద్వారా స్పందించిన అల్లు అర్జున్
ట్విటర్ ద్వారా స్పందించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్
ట్విటర్ ద్వారా స్పందించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్
ట్విటర్ ద్వారా స్పందించిన నాగార్జున అక్కినేని
ట్విటర్ ద్వారా స్పందించిన సమంత అక్కినేని
ట్విటర్ ద్వారా స్పందించిన రామ్ పోతినేని
ట్విటర్ ద్వారా స్పందించిన రవితేజ
ట్విటర్ ద్వారా స్పందించిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి
నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై యాంకర్ అనసూయ భరద్వాజ్ రియాక్షన్