YS Sharmila Padayatra: దివంగత నేత వైఎస్ఆర్ (YSR) కుమార్తె వైఎస్ షర్మిల (YS Shjarmila) తెలంగాణాలో గ్రామా స్థాయి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 'ప్రజా ప్రస్థానం' (Praja Prasthanam) పాద యాత్ర మొదలెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం నాటికి 8 వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర ఇపుడు మహేశ్వరం (Maheshwaram) నియోజకవర్గంలో కొనసాగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా పాదయాత్రలో ఆసక్తికర సంఘటన నెలకొంది. షర్మిలతో పాటూ టాలీవుడ్ ప్రముఖ యాంకర్ (Anchot Shyamala) మరియు  బిగ్ బాస్ (BiggBoss)ఫేమ్ యాంకర్ శ్యామల కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. 


Also Read: Ex & Current Girlfriend Fighting: ప్రేమ ఎంత మధురం.. ప్రియురా"ళ్లు" అంత కఠినం


యాంకర్ శ్యామల మాట్లాడుతూ.. "మొదటి నుండి వైఎస్ఆర్ ఫ్యామిలీ (Ysr Family) అభిమానిని..  వైఎస్ మహానేత కుమార్తె.. ఆమె సోదరుడు ఒక రాష్ట్రానికి సీఎం.. ఆమె ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు.. కానీ అవన్నీ ఆమె వదులుకొని, మన కోసం, సామాన్యుల కోసం రోడ్లపైకి వచ్చింది. తండ్రి ఆశయాలను భుజాన వేసుకొని ముందుకు వచ్చిన షర్మిలా అక్క నాకు, మన అందరికి ఆదర్శమని తెలిపింది".  




అంతేకాకుండా.. "గత ఎనిమిది రోజులుగా అక్క షర్మిల ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోటానికి వచ్చింది.. సమాజంలో మార్పు కోసమే అక్క వచ్చారని.. అందుకే ఆమెకు మద్దతు తెలుపుతూ పాద యాత్రలో పాల్గొన్నానని యాంకర్ శ్యామల తెలిపారు. షర్మిల చేపట్టిన యాత్రలో ప్రజలు తమ సమస్యలను అక్కతో చెప్పుకోటానికి స్వయంగా వస్తున్నారని.. అది చూసి నాకు ఎంతో సంతోషంగా ఉందని శ్యామల పేర్కొన్నారు". 


Also Read: Ex & Current Girlfriend Fighting: ప్రేమ ఎంత మధురం.. ప్రియురా"ళ్లు" అంత కఠినం


ఇదిలా ఉండగా.. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajashekar Reddy) పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా పాదయాత్రను ప్రారంభించటం విశేషం. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి