వరంగల్ విషాదం: నేడు మరో 3 మృతదేహాలు లభ్యం.. బావిలో ఇంకెన్ని?
Migrant Workers Family Committed Suicide వరంగల్ జిల్లాలో బావిలో శవాల ఘటన మరింత విషాదంగా మారింది. నిన్న బావిలో నుంచి మృతదేహాలను వెలికితీయగా, నేడు మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
వరంగల్ జిల్లాలో బావిలో శవాల ఘటన మరింత విషాదంగా మారింది. నిన్న బావిలో నుంచి మృతదేహాలను వెలికితీయగా, నేడు మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బావిలో లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. వరంగల్ శివారులోని గీసుగొండ మండలం గొర్రెకుంటలో జరిగిన ఈ విషాదంపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్థి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వరంగల్‌లో బావిలో దూకిన వలసకూలీల కుటుంబం
గురువారం (మే 21న) నాలుగు మృతదేహాలను వెలికితీయగా వారిని ఎండీ మక్సూద్(50), భార్య నిషా(45), వారి కుమార్తె బుస్ర(20) గా గుర్తించారు. వీరితో పాటు మూడేళ్ల ఓ బాబు మృతదేహాన్ని నిన్న వెలికితీశారు. నేడు (మే 22న) వెలికితీసిన మృతదేహాలను మక్సూద్ కుమారుడు, షోయబ్ అలం, సోహైల్ అలం, ఎండి షకీల్ వెస్ట్ త్రిపుర వాసిగా గుర్తించారు. Photos: రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
మక్సూద్ దాదాపు 20 ఏళ్ల కిందట కుటుంబంతో సహా పశ్చిమ బెంగాల్ నుంచి బతుకుదెరువు కోసం వరంగల్‌కు వచ్చాడు. గీసుగొండ మండలం గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో పనిచేస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉండేవాడు. గత కొన్నేళ్లుగా మక్సూద్ కుటుంబసభ్యులతో కలిసి గోదాంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం గోదాం యజమాని సంతోష్ రోజులాగే అక్కడికి వచ్చాడు. పనివారెవ్వరూ కనిపించడం లేదని చుట్టుపక్కల వెతుకుతూంటే సమీపంలో ఉన్న పాడుపడ్డ బావిలో నలుగురి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. తొలిసారి రూ.49 వేల మార్క్ చేరిన బంగారం
గీసుకొండ పోలీసులకు సమాచారం అందించాడు. క్లూస్ టీమ్, పోలీసులు డాగ్ స్క్వాడ్ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. నిన్న నాలుగు మృతదేహాలు లభ్యం కాగా, నేడు మరో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలులేవని సామూహిక హత్యలే అయి ఉండొచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్