ఇంటర్ ఫలితాల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి - టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్
ఇంటర్ మార్కుల అవకతవకలపై గవర్నర్ నరసింహన్ కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి
ఇంటర్ మార్కుల అవతకతవకల అంశంపై గవర్నర్ నరిసింహన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇంటర్ ఫలితాల విషయంలో విద్యా శాఖా మంత్రి సమర్ధంగా వ్యవహరించలేదన్నారు. ఇంటర్ ఫలితాల విషయంలో టి సర్కార్ తెలంగాణ విద్యార్థుల విశ్వాసం కోల్పోయిందని దయ్యబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.