Revanth Reddy: రేపటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ చేపట్టే యాత్ర మాములు పాదయాత్ర కాదని..దేశ దశదిశను మారుస్తుందన్నారు. రాజకీయాలు, ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా సాగనుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ పాలనలో దేశంలో విద్వేషం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. పేదల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు. అందుకే బీజేపీలో భయం మొదలైందని విమర్శించారు. ప్రజలను భయపెట్టి ఆధిపత్యం చేయాలనుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు భారత్ జోడో యాత్ర అని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. అక్టోబర్ 24, 25 తేదీల్లో పాదయాత్ర తెలంగాణలో అడుగు పెడుతుందన్నారు.


తెలంగాణలో 15 రోజులపాటు సుమారు 350 కిలోమీరట్ల మేర భారత్ జోడోయాత్ర సాగుతుందని వెల్లడించారు. కొత్త పార్లమెట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబసభ్యుల హస్తం ఉందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఇలాంటి స్కామ్‌లన్నీ కేంద్రం, ప్రగతిభవన్‌లో జరుగుతాయని విమర్శించారు.


ప్రగతిభవన్‌లో సోదాలు చేయకుండా బీజేపీ కల్లబొల్లి కబర్లు చెబుతోందని ఫైర్ అయ్యారు రేవంత్‌రెడ్డి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతిధుల ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2014-22 మధ్య జరిగిన ఫిరాయింపులు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరగాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు కుదించడం సీఎం కేసీఆర్ అరాచకానికి పరాకాష్ట అని మండిపడ్డారు.


సెప్టెంబర్ 17పై అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. దీనిపై బీజేపీ అతి తెలివితేటు చూపిస్తోందని తెలిపారు. దీనిని హిందూ-ముస్లిం గొడవగా చూపించే ప్రయత్నం జరుగుతోందని..దీనిపై జాగ్రత్తగా ఉండాలన్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పేటెంట్‌ను బీజేపీ,టీఆర్ఎస్ దొంగలించాలని చూస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు ఉందన్నారు.


Also read:Asia Cup 2022: ఈసారి ఆసియా కప్ వారిదే..భారత మాజీ స్టార్ ప్లేయర్ జోస్యం..!


Also read:Kottu Satyanarayana: ఏపీలోని ఆలయాల్లో ఇకపై డిజిటల్ దర్శనాలు: మంత్రి కొట్టు సత్యనారాయణ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి