Revanth Reddy: పర్యటనలన్నీ రద్దు.. ఎంపీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్?
Revanth Reddy Delhi Tour: మరోసారి ఢిల్లీ పర్యటనకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ముందస్తుగా నిర్ణయించిన పర్యటనలన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో కీలకమైన పనులు.....
Delhi Tour: అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తరచూ దేశ రాజధాని ఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా మరోసారి హస్తినకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. గతంలో పార్టీతోపాటు ప్రభుత్వ పాలనా వ్యవహారాల కోసం ఢిల్లీకి వెళ్లగా.. ఈసారి రాజకీయాల కోసమే వెళ్తున్నారని సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడం.. ప్రత్యర్థులు అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వాటిపై చర్చించేందుకు ఢిల్లీ పర్యటన చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: KCR: రేవంత్ రెడ్డికి హామీల అమలు చేతకాక నాలుక మడతేసి అబద్ధాలు: కేసీఆర్
పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే బీజేపీ 9 మంది ఎంపీ అభ్యర్థులు, బీఆర్‌ఎస్ పార్టీ ఐదుగురి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థుల ప్రకటన అంశమై రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే కొడంగల్ సభలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. అయితే రేవంత్ స్వయంగా ప్రకటించడం పార్టీలో వివాదం రేపింది. ఇక రాష్ట్రంలో మిగిలిన 16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అధిష్టానం అనుమతితో ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: Revanth Reddy Temple: సీఎంగా ఎన్నికై 100 రోజులు కూడా కాలే.. అప్పుడే రేవంత్ రెడ్డికి గుడి
అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై అధిష్టానంతో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రకటన కొన్ని రోజుల్లో వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో అభ్యర్థులను వెంటనే ప్రకటించాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టతకు వచ్చిన రేవంత్ రెడ్డి అదే విషయాన్ని పార్టీ అధిష్టానం ముందు ఉంచనున్నారు. ఇప్పటికే లోక్‌సభకు పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. వాటిని క్రోడీకరించి ఒక జాబితా సిద్ధం చేశారని, ఆ జాబితాలో కొందరిని ఎంపిక చేసేందుకు అధిష్టానం అనుమతి కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook