Revanth Reddy: అమ్ముడుపోయిన సర్పంచ్ లను చితక్కొట్టండి.. మునుగోడులో రేవంత్ రెడ్డి పిలుపు
Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు మునుగోడులో పర్యటించారు.టీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్ విడుదల చేశారు.మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు మునుగోడులో పర్యటించారు. టీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్ విడుదల చేశారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు. బీజేపీ ఇచ్చిన 22 వేల కోట్ల కాంట్రాక్టులకు కక్కుర్తి పడి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. కమలం పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్, బీజేపీపై జానారెడ్డి ఛార్జ్ షీట్ విడుదల చేశారంటే ఆ పార్టీలకు కష్టాలు తప్పవన్నారు రేవంత్ రెడ్డి. నల్లగొండ జిల్లా ఉద్యమానికి పెట్టింది పేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి140 ఏళ్ళ చరిత్ర ఉందన్న రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. చెప్పుకోవడానికి చరిత్ర లేనివాళ్లు ప్రస్తుతం మతం పేరుతో తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఓట్ల కోసం విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధుల కొనుగోళ్లు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులో నేతల అమ్మకాలు తప్ప అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన నేతలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని అన్నారు. అమ్ముడుపోయిన నేతలను చీపుర్లతో చితకొట్టాలని మహిళలకు ఆయన పిలుపిచ్చారు.
సెప్టెంబర్ 17 వివాదంపైనా తనదైన శైలిలో స్పందించారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి వజ్రోత్సవాలు సంవత్సరం పాటు నిర్వహిస్తామని చెప్పారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి.. తెలంగాణ విమోచన దినోత్సవం - సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తామని వీళ్లు ఏ నాడు చెప్పలేదు.ఇప్పుడు నేనంటే నేనని పోటీ పడుతున్నారు. దీనిని ప్రజల మనోభావాలకు ఇచ్చే గౌరవం అనరు, పచ్చి అవకాశవాద రాజకీయం అంటారు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read : KCR VS NTR: మెగా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్.. ఎన్టీఆర్ కు బ్రేక్! కేసీఆర్ సర్కార్ ఎందుకిలా..?
Also Read: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి