Revanth Reddy: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ ప్రదేశ్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్  చేశారు. కుటుంబంలో వాటాల పంచాయతీ తెంచడానికే బీఆర్‌ఎస్ అని అన్నారు. యూపీఏను చీల్చడానికే సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్‌ను ఎందుకు కలుపుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతీ చర్య..బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికేనని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోదీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలన్నారు. మోదీ సూచనలతోనే గులాబీ బాస్ నడుచుకుంటున్నారని విమర్శించారు రేవంత్‌రెడ్డి. అందుకే సీఎం కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఛార్జ్‌ షీట్ ఫైల్ చేయడం లేదన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో సీఎంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకే కేసీఆర్, మోదీ ప్రయత్నాలని ఆరోపించారు. 


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ నాయకులపైకి ఈడీని ఉసిగోల్పుతున్నారని విమర్శించారు. రాహుల్ పాదయాత్రకు భయపడే..మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరిపించారన్నారు. ఈకేసులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గతంలోనే కేసులన్నీ క్లోస్ చేశారని గుర్తు చేశారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులపై కక్ష గట్టే విచారణకు పిలిపించారన్నారు రేవంత్. 


కర్ణాటకలో యాత్రను అడ్డుకునేందుకు శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలిచారని తెలిపారు. ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉంటే..అక్కడి నేతలకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈడీని తన ఎలక్షన్ డిపార్ట్‌మెంట్‌గా బీజేపీ మార్చుకుందని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ నేతలకు నోటీసులు ఇవ్వడం వెనుక కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి. బీజేపీకి చందాలు ఇచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. 


ఆరేళ్లలో బీజేపీకి రూ.4841 కోట్ల చందాలు వచ్చాయన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటుతామన్నారు.


Also read:Fishermen: తమిళనాడు మత్స్యకారుల వలకు చిక్కిన అంబర్ గ్రిస్..ధర తెలుస్తే షాకే..!


Also read:CM Kcr: ఈనెల 5న గులాబీ షో..ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook