Revanth Reddy : మరోసారి రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. జూబ్లీహిల్స్‌లోని నివాసం వద్ద టెన్షన్.. టెన్షన్..
Revanth Reddy House Arrest : వరంగల్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Revanth Reddy House Arrest : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా శాయంపేటలో నేడు (డిసెంబర్ 31) రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ సిద్ధమవడంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి ఉదయాన్నే చేరుకున్న పోలీస్ బలగాలు... ఆయన బయటకు రాకుండా ఇంట్లోనే నిర్బంధించారు. ప్రస్తుతం అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హౌస్ అరెస్టుపై రేవంత్ రెడ్డి (Revanth Reddy house arrest) పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించారని పోలీసులను ఆయన నిలదీశారు. తెలంగాణలో నియంత్రుత్వ పాలన నడుస్తోందని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా ఆఫ్గనిస్తానా లేక ఉత్తర కొరియానా అని ప్రశ్నించారు. 2021 ముగింపుకు వచ్చిన వేళ... ఇక టీఆర్ఎస్ పాలనకు కూడా కాంగ్రెస్ ముగింపు కార్డు వేస్తుందన్నారు.
కాగా, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధపడటంతో పోలీసులు ఆయన్ను నిర్బంధించారు. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ విషయం తెలిసి కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టగా.. ఆ సందర్భంలోనూ ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ తాజా హౌస్ అరెస్టుతో ఆయన ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రైతులు వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ (CM KCR)... ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి ఎందుకు చేస్తున్నారని ఇటీవల రేవంత్ ప్రశ్నించారు. తనకో న్యాయం... రైతులకో న్యాయమా అని ప్రశ్నించారు. యాసంగిలో రైతులంతా వరి సాగు చేయాలని... ప్రభుత్వం ఎందుకు కొనదో చూస్తామని అన్నారు.
Also Read: Quinton de Kock: క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook