Revanth Reddy on Go No 111 Cancelation: సీఎం కేసీఆర్ జీవో 111 రద్దు ఆదేశాల వెనక నేపథ్యం మనం గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 111 జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ప్రమాదకరమన్నారు. కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకున్నాంటున్నారని మండిపడ్డారు. "1908లో హైదరాబాద్‌కు వరదలు వచ్చి 50 వేల ప్రాణ నష్టం జరిగింది.. వరద నివారణకు ఆనాటి నిజాం  గ్లోబల్ టెండర్లు పిలిచారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో మూసీ, ఈసా నదులపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జంట జలాశయాలను రక్షించేందుకు 1996లో 111 జీవోను ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. 84 గ్రామాలను బయో కన్జర్వేషన్ జోన్‌లో పెట్టారు. నిజాం, సమైక్య పాలకులు కూడా నగరాన్ని  రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 111 జీవోను అమలు చేశారు. కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 111 జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ప్రమాదం. జీవో రద్దు వెనక కుట్ర ఉంది.
80 శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లింది. 111 జీవో రద్దు దుర్మార్గపు నిర్ణయం. కేసీఆర్‌ను కోసి కారం పెట్టినా తప్పులేదు.." అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 


కాంగ్రెస్ పోరాటం ఫలితంగానే కృష్ణా, గోదావరి జలాలు తరలింపు జరిగిందని ఆయన అన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను విధ్వంసం చేసే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు పైపులైన్ ఇస్తాననడం వెనక కుట్ర దాగుందన్నారు. ఈ విషయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనక లక్షల కోట్ల కుంభకోణం దాగుందని ఆరోపించారు. బందిపోట్లను, దావూద్‌నైనా క్షమించవచ్చు.. కానీ కేసీఆర్, కేటీఆర్‌ను క్షమించ కూడదన్నారు. మొత్తం భూములు పేదల నుంచి కొనుగులు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారని అన్నారు.


పర్యావరణ విధ్వంసానికి కేసీఆర్ పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధ్వంసం వెనుక భారీ భూ కుంభకోణం ఉందన్నారు. కాంగ్రెస్ నిజ నిర్దారణ కమిటీని నియమిస్తున్నామని.. 2019 నుంచి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నేతలు కొన్న భూముల వివరాలు కమిటీ సేకరిస్తుందన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు జరిగిన భూ లావాదేవీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బినామీ యాక్టును కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్‌ మనీ ఇస్తోందని.. ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం అన్నారు. 


Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?  


Also Read: Bandi Sanjay Speech: కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి: బండి సంజయ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి