Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి.. సీఎల్పీ అత్యవసర సమావేశం..
Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో కాక రేపుతోంది. రాహుల్ వరంగల్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న టీపీసీసీ నేతలు.. ఉస్మానియా యూనివర్శిటీ సభపైనా ఫోకస్ చేశారు. రాహుల్ గాంధీ సభకు ఓయూ వీసీ అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో కాక రేపుతోంది. రాహుల్ వరంగల్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న టీపీసీసీ నేతలు.. ఉస్మానియా యూనివర్శిటీ సభపైనా ఫోకస్ చేశారు. రాహుల్ గాంధీ సభకు ఓయూ వీసీ అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ ను ఉస్మానియాకు తీసుకువెళ్లాలని భావిస్తున్న పీసీసీ నేతలు.. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. గాంధీభవన్ లో సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ వరంగల్ సభకు జన సమీకరణతో పాటు ఓయూలో విద్యార్థుల ఇంటరాక్షన్ గురించి చర్చించారు. రాహుల్ సభకు వీసీ అనుమతి ఇవ్వకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేతలు. కోర్టు నిర్ణయం తర్వాత ఏం చేయాలన్న దానిపై చర్చించారు.
రాహుల్ గాంధీని ఎలాగైనా ఉస్మానియా యూనివర్శిటీకి తీసుకువెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనిపై వీసీతో అమీతుమీ తేల్చుకోవాలని చూస్తున్నారు. అయినా వీసీ దిగిరాకపోతే.. ఉస్మానియా విద్యార్థులతో ఏదైనా హోటల్ లో రాహుల్ తో సమావేశం ఏర్పాటు చేయించాలనే యోచనలో పీసీసీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులతో రాహుల్ సమావేశం అయితే.. అది తమకు బాగా లాభిస్తుందనే ఆలోచనలో టీపీసీసీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ తో పాటు ఓయూ విద్యార్థులను పరామర్శించారు. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఓయూలో ఆదివారం ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. వీసీ ఛాంబర్ దగ్గర ధర్నా చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బల్మూరు వెంకట్ సహా కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ కార్యకర్తలను పరామర్శించేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. ఇక విద్యార్థి నేతల అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. సీఎం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
Read also: Telangana Congress: టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం.. అద్దంకి దయాకర్‌కి షోకాజ్ నోటీసులు!
Yadadri Temple: లాంగ్ లీవ్‌లో యాదాద్రి ఈవో గీతారెడ్డి... ఇంచార్జ్ ఈవోగా రామకృష్ణ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి