Rahul Gandhi Bharath Jodo Yatra:  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ నడకు సాగుతోంది. కర్ణాటక నుంచి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తారు రాహుల్. తెలంగాణకు సంబంధించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఫైనల్ రూట్ మ్యాప్ ఖరారైంది. ముందుకు అనుకున్నట్లుగా కాకుండా తెలంగాణ రాహుల్ భారత్ జోడో యాత్రను 13 రోజులకు కుదించారు. రాష్ట్రంలో మొత్తం 359 కిలోమీటర్లు  పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. 13 రోజుల పాటు రోజు వారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధం చేసింది పీసీసీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మక్తల్  నియోజకవర్గంలోని కృష్ణా మండలం కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగే తొలిరోజు యాత్రలో  కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. రెండవ రోజు  దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలు రాహుల్ వెంట నడుస్తారు. మూడవ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీలో పాదయాత్ర సాగనుండగా..  నల్గొండ పార్లమెంట్ నేతలు పాల్గొంటారు.నాలుగవ రోజు జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో నాగర్ కర్నూల్ , ఖమ్మం లోక్ సభలో పరిధిలోని కాంగ్రెస్ నేతలు రాహుల్ వెంట నడుస్తారు. ఐదవ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో మహేశ్వరం అసెంబ్లీ తోపాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.


ఇక ఆరవ రోజు శంషా బాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తారు. ఏడవ రోజు  శేరిలింగంపల్లి నియోజకవర్గం రాహుల్ పాదయాత్ర చేయనుండదా. చేవెళ్ల, సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని లీడర్లు పాల్గొంటారు. 8వ రోజు బీహెచ్ఈఎల్ ప్రాంతంలో జరిగే యాత్రకు మల్కాజ్ గిరి, మహబూబా బాద్ పార్లమెంట్ పరిధి నేతలు వస్తారు.తొమ్మిదవ రోజు సంగారెడ్డి లో రాహుల్ యాత్ర సాగనుడంగా.. మెదక్, వరంగల్ లోక్ సభ నేతలు పాల్గొంటారు.10వ రోజు జోగిపేటలో జరిగే రాహుల్ పాదయాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి లోక్ సభ సెగ్మెంట్ లోని నాయకులు నడుస్తారు. 11వ రోజు శంకరం పేట ప్రాంతంలో జరిగే రాహుల్ పాదయాత్రకు ఆదిలాబాద్ ఎంపీ పరిధిలోని నేతలు హాజరవుతారు. 12వ రోజు జుక్కల్ సెగ్మెంట్ లో జరిగే యాత్రలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.చివరి రోజు రాహుల్ భారత్ జోడో యాత్రలో కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొంటారు.


[[{"fid":"247071","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also Read : Khairatabad Ganesh: బ్రేకింగ్.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి చైర్మెన్ మృతి


Also Read :  LPG Cylinder: దసరా పండగ వేళ ఎల్పీజీ వినియోగదారులకు షాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి