Revanth Reddy On Dharani Portal: ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోందని.. కానీ దీని వెనక పెద్ద మాఫియా దాగుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించి ధరణి ఫైల్స్‌ను ఆధారాలతో సహా సీరియల్‌గా బయటపెడతామన్నారు. దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం గాంధీ భవన్‌లో  మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ధరణి రూపంలో ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దారి దోపిడీ దొంగల కంటే భయంకరమైన దోపిడీ జరుగుతోందని.. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న సంస్థలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా ఆర్థిక నేరగాళ్లు అని.. వారిలో విదేశీయులు ఉన్నారని అన్నారు రేవంత్ రెడ్డి. అనేక చేతులు మారి చివరకు బ్రిటిష్‌ ఐల్యాండ్‌ చేతికి వెళ్లిందన్నారు. ధరణి పోర్టల్ సాయంతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని.. దీనికి మొత్తం కారకుడు శ్రీధర్ గాదె అలియాస్ గాదె శ్రీధర్ రాజు అని ఆరోపించారు. తమ పార్టీలోకి అధికారంలోకి వస్తే.. ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ భూ అక్రమాలు, ధరణిలో జరిగిన అక్రమాలను జూలై 15 తర్వాత బయటపెడతామని స్పష్టం చేశారు. అనంతరం భూమి డిక్లరేషన్ విడుదల చేశారు.


అంతకముందు ఇందిరా భవన్‌లో  ఎల్‌డీఎమ్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీని, బీఆర్ఎస్‌ను వేరుగా చూడొద్దని.. ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని అన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. ఈ నెల 15వ తేదీలోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయని.. ఓటరు జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందన్నారు. 


"ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వచ్చే 12వేల ఓట్లను తొలగించారు. కుటుంబానికి 5 ఓట్లు ఉంటే 2 ఓట్లు డిలీట్ చేశారు. బూత్‌లు మార్చి ఓటరును  గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ ఎదుర్కొవడంలో బూత్ లెవెల్ ఏజెంటే కీలకం. బూత్ వారీగా ఓటర్ లిస్టును క్షుణ్ణంగా పరిశీలించాలి. ఓటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లే. బీజేపీని, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దు. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలి. 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి.." అని రేవంత్ రెడ్డి అన్నారు.


Also Read: Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై  


Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి