Revanth Reddy Serious Warning to Leaders: పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని.. కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని.. క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీల డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. రాష్ట్రంలో హాంగ్ వస్తుందని.. బీజేపీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుందని బీఎల్ సంతోష్ చెబుతున్నారని అన్నారు.  కాంగ్రెస్, బీజేపీ కలవవు అని అందరికీ తెలుసు.. హాంగ్ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని చెప్పారు.
 
"కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయి. కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. అందుకే అక్కడ మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలోనూ మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా నిలవండి. కేసీఆర్, కేటీఆర్ సోనియా గాంధీను దూషిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్‌ను నిందిస్తుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధం.. మరి ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్‌ను దూషిస్తోంది..? పదవులు త్యాగం చేసినందుకా..? దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసినందుకా..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్‌లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలేదు. తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పేవి. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్. 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చింది.. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బడుగులు బలహీన వర్గాలు, మైనారిటీలకు మేలు. కేసీఆర్, మోదీ అపూర్వ సోదరులు. వచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరికీ బుద్ది చెప్పాలి. సోనియా గాంధీని విమర్శించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.." అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 


Also Read: Osmania University: ఉస్మానియా వర్సిటీకి కేంద్రం గుడ్‌న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల 


Also Read: Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి