Revanth Reddy On Minister Srinivas Goud: రాష్ట్రంలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాలు కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని.. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోవడానికి కాదన్నారు. దళితుల భూములు గుంజుకోవాలని కాదన్నారు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆర్‌ఎస్ గుంజుకుంటోందని ఆరోపించారు. 100 కోట్లు పలికే భూములకు ఎకరానికి కోటి అయినా పేదలకు ఇవ్వాలి కదా..? అని అన్నారు. ఔటర్ పక్కన 65 వేల కోట్ల విలువైన భూమి ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే అన్ని ఆస్తులు అమ్ముకుని కేసీఆర్ విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారు. సొంత మనుషులకు అప్పగించేందుకే వైన్ షాపులకు ముందే టెండర్లు వేశారు. నాలుగు నెలల ముందు ఎలా టెండర్లు ఇస్తారు..? కాంగ్రెస్ వచ్చాక మళ్లీ టెండర్లు వేస్తాం.. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారు..? భూములు కొన్నవారు జాగ్రత్త.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. కేసీఆర్  ఓటమి భయంతోనే అన్నీ అమ్ముకుంటున్నారు. 


శ్రీనివాస్ గౌడ్ మా వాళ్లపై అక్రమ కేసులు పెట్టించారు. మేం మహబూబ్ నగర్ వస్తే నీ వీపు చింతపండు అవుతుంది జాగ్రత్త. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.. పోలీసు అధికారులకు చెబుతున్నా.. రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం.. కేసీఆర్‌కు తన నాయకత్వంపై నమ్మకముంటే గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి.. మహబూబ్ నగర్ జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించండి.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాది.." అని రేవంత్ రెడ్డి అన్నారు.


Also Read: Ind Vs WI 5th T20 Highlights: మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్.. హార్థిక్ పాండ్యాను ఆడుకుంటున్న ఫ్యాన్స్  


Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం