Revanth Reddy: చంద్రబాబుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా.. వైఎస్సార్‌ను ఏం చేయలేకపోయారు: రేవంత్ రెడ్డి
Revanth Reddy On Chandrababu Naidu: గతంలో చంద్రబాబు నాయుడుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా.. వైఎస్సార్‌ను ఏం చేయకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన కాంగ్రెస్ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Revanth Reddy On Chandrababu Naidu: దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా.. ప్రధాని మోదీ స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం దురాక్రమణలకు అనుమతి ఇచినట్లేనని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రధానిగా అవకాశం వచ్చినా.. సోనియా గాంధీ పదవి స్వీకరించలేదని గుర్తు చేశారు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని బోయినిపల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో శిక్షణా కార్యక్రమంలో ఆయనతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా.. వైఎస్సార్‌ను ఏమీ చేయలేకపోయారని అన్నారు. ఏ మీడియా కూడా ప్రభుత్వాలను శాసించలేదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు.
'ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారు. జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. ప్రతీ గడపకు తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్లాన బాధ్యత నాయకులపై ఉంది. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓటరు లిస్టులో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉంది..' అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై , కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేద్దామని ఆయన చెప్పారు. నిపుణులు అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దామన్నారు. 2003లో ఎలాంటి విపత్కర పరిస్థులను ప్రజలు ఎదుర్కొన్నారో.. 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రెస్ పార్టీనేన్నారు. మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదని.. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదంటూ బండి సంజయ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Income Tax: న్యూ ఇయర్‌లో పన్ను చెల్లింపుదారులకు షాక్.. రూ.54 వేల ట్యాక్స్ చెల్లించాల్సిందే..!
Also Read: Aadhaar Update: గుడ్‌న్యూస్.. ఇంట్లోనే కూర్చొని ఆధార్ అప్‌డేట్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి