Mohammad Azharuddin: రేవంత్ రెడ్డి నిర్ణయాలతో పార్లమెంట్లో ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా: అజహరుద్దీన్
Mohammad Azharuddin on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోనుందని మాజీ ఎంపీ అజహరుద్దీన్ అన్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు భరోసా ఇస్తున్నారని ప్రశంసించారు.
Mohammad Azharuddin on Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పరిపాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్ని శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే వీటిలో రెండు గ్యారంటీలు అమలు చేసిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంచారు. త్వరలోనే ప్రతి రేషన్ కార్డు ఉన్న ఇంటికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ అన్నారు.
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు మేనిఫెస్టోను అమలు చేస్తునే.. మరోవైపు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజల మన్ననలను అందుకున్నారని చెప్పారు. గిగ్ వర్కర్లతో సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నారని అన్నారు. ఆటో, క్యాబ్, రిక్షా డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌కు ఇది వర్తిస్తుందన్నారు.
సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షలాది కుటుంబాలకు భరోసా ఇచ్చారని అన్నారు అజహరుద్దీన్. ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించడానికి ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రజా పాలన పేరుతో అధికారులను పల్లెబాట పట్టించనున్నారని తెలిపారు. జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలపడి.. ఎక్కువస్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి