Traffic Alert: వీకెండ్ వచ్చిందంటే హైదరాబాదీలకు జోష్ వస్తుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జాలీగా గడపాలని ప్లాన్ చేస్తుంటారు. పార్కుకు వెళ్లడం, షాపింగ్ చేయడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. కాని ఈ వీకెండ్ లో మాత్రం హైదరాబాదీలకు అలాంటి అవకాశం లేకుండా చేస్తోంది. శని, ఆదివారాల్లో నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు సూచించారు. అత్యంత ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి రావొద్దని సూచిస్తున్నారు. దీంతో వీకెండ్ ను ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్న నగరవాసులు నిరాశ పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదారాబాద్ లో జూలై 2,3 తేదీల్లో మాదాపూర్ లోని హెచ్ ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు 50 మంది కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు... అన్ని రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ఈ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రధాని మోడీ జూలై 4 వరకు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగం సభ నిర్వహిస్తోంది. దీంతో కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసీసీతో పాటు బహిరంగ సభ జరిగే సికింద్రాబాద్ మొత్తం భద్రతా బలగాల ఆధీనంలో ఉంది. నగరంలోని వివిధ స్టార్ హోటళ్లలో బీజేపీ టాప్ లీడర్లు బస చేస్తున్నారు. దీంతో పంజాగుట్ట, జూబ్లీగిల్స్, బంజారాహిల్స్ , మాదాపూర్ ప్రాంతాల్లోనూ భద్రత పెంచారు.


బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెఐసీసీ, హెటెక్స్ జంక్షన్, సైబర్ టవర్స్ మార్గాలను పూర్తిగా మూసి వేస్తున్నారు. ఈ రెండు రెండు రోజులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


ఈ మార్గాల్లో ట్రాఫిక్ అంక్షలు..


మాదాపూర్ కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ జంక్షన్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి ఐకియా రోటరి ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు డ్యూటీ టైమింగ్స్ మార్చుకోవాలని పోలీసులు సూచించారు. జూలై 2,3 తేదీలలో వర్క్ ప్రమ్ హోమ్ చేస్తే బెటరని సలహా ఇచ్చారు.


నీరూస్‌ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లే వారు సీఓడీ  మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ నుంచి దుర్గంచెరువు-ఇనార్బిట్‌-ఐటీసీ కోహినూర్‌-ఐకియా-బయోడైవర్సిటీ-గచ్చిబౌలి మీదుగా సైబర్‌ టవర్స్‌ వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి.


ఆర్సీపురం, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌-నల్లగండ్ల-హెచ్‌సీయూ-ట్రిపుల్‌ ఐటీ-గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్‌, ఆల్విన్‌ రోడ్డు వైపునకు అనుమతి లేదు.


మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ ప్రాంతాల నుంచి వచ్చే వారు హైటెక్‌ సిటీ- సైబర్‌ టవర్స్‌-జూబ్లీహిల్స్‌ వచ్చే వాహనాలు రోల్లింగ్‌ హిల్స్‌ ఏఐజీ హాస్పిటల్‌-ఐకియా-ఇనార్బిట్‌-దుర్గం చెరువు రోడ్డులో వెళ్లాలి


జేఎన్ టీయూ నుంచి సైబర్ టవర్స్ వైపు వెళ్లే వాహనాలను అనుమతి లేదు


మియాపూర్ నుంచి కొత్తగూడ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు


బయోడైవర్సిటీ నుంచి జేఎన్ టీయూ వైపు  వాహనాలను అనుమతి లేదు


నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు


Read also: Hero Vishal: కుప్పంలో పోటీపై తేల్చేసిన విశాల్.. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు..


Read also: Flexi War: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల రచ్చ.. పోలీసులకు పార్టీల ఫిర్యాదులు! ఇవాళ ఏం జరుగుతుందో?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook