ఆర్టీసీ సమ్మెపై మంత్రి పువ్వాడ టెలికాన్ఫరెన్స్
ఆర్టీసీ సమ్మెపై మంత్రి పువ్వాడ టెలికాన్ఫరెన్స్
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె, సమ్మె తదనంతర పరిణామాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మె ప్రభావం, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు తీసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మంత్రి వారినే అడిగి తెలుసుకున్నారు. అన్ని జిల్లాల్లోని రీజినల్ మేనేజర్లు ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రద్దీ అధికంగా ఉండే అన్ని మార్గాల్లోనూ మరిన్ని బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అజయ్ కుమార్ ఆదేశించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ వంద శాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఆర్టీసీ డీఎంలు, డీవీఎంలు, రీజినల్ మేనేజర్ల నుంచి ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.